అమాయకులను మోసం చేస్తున్న నీకు అరదండాలు తప్పవు డియర్: ఫేక్ ఖతాదారుడికి సోనూ సూద్ వార్నింగ్

  • ట్విట్టర్ లో నకిలీ సోనూ సూద్
  • బాధితుల నుంచి వివరాలు సేకరిస్తున్న వైనం
  • మోసం చేయడం మానుకోవాలన్న రియల్ సోనూ సూద్
లాక్ డౌన్ కాలంలో ఒక్కసారిగా రియల్ హీరోగా అవతరించిన సోనూ సూద్ కు కూడా నకిలీల బెడద తప్పడంలేదు. ట్విట్టర్ లో 'యాక్టర్ సోనూ సూద్' (Actor Sonu Sood) పేరిట అమాయకులను మోసం చేస్తున్నట్టు సోనూ సూద్ గుర్తించారు. తన పేరిట అమాయకులను మోసం చేస్తున్న ఆ ఫేక్ ఖాతాదారుడికి సోనూ సూద్ గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. ప్రజలను మోసం చేస్తున్నందుకు త్వరలోనే అరెస్ట్ కావడం తథ్యం డియర్ అంటూ హెచ్చరించారు.

ఇకనైనా మోసాలు కట్టిపెట్టాలని హితవు పలికారు. ఆలస్యమైతే ఆ తర్వాత స్పందించినా ఉపయోగం ఉండదని స్పష్టం చేశారు. కాగా, 'యాక్టర్ సోనూ సూద్' అనే ట్విట్టర్ అకౌంట్ పేరుతో సదరు వ్యక్తి ఇతరుల నుంచి వస్తున్న విజ్ఞప్తులను స్వీకరిస్తున్నట్టు వెల్లడైంది. అంతేకాదు, నకిలీ జీమెయిల్ ఐడీలను ఇస్తూ బాధితుల నుంచి వివరాలు సేకరిస్తున్నట్టు గుర్తించారు.


Sonu Sood
Fake Account
Cheating
Twitter
Lockdown
Corona Virus

More Telugu News